రబ్బర్‌ షూలను రూ.40 వేలకు అమ్ముతున్న గుస్సీ

V6 Velugu Posted on Jun 08, 2021

భారతీయ కుర్తను లక్షల్లో అమ్మి సోషల్‌ మీడియాలో వైరలైంది గుస్సీ సంస్థ. ఇప్పుడు మరో ప్రాడక్ట్ ను కూడా  వేలల్లో అమ్మకానికి పెట్టింది. క్రోక్సా కంపెనీకి చెందిన రబ్బర్‌ షూలను రూ. 40 వేలకు అమ్మేందుకు తన సైట్ లో పెట్టింది. ఆ సంస్థ నిర్ణయించిన ధరను చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుస్సి ప్రముఖ ఇటాలియన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌. అయితే .. ఈ సంస్థ ఇటీవల చేస్తోన్న ప్రకటనలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వస్తువుల నాణ్యతకు పొంతనలేని ధరలను నిర్ణయిస్తోంది.

క్రోక్సా కంపెనీ రబ్బర్‌ షూలను కూడా పొంతనలేని ధరకు అమ్మకానికి పెట్టింది. అయితే, భారత మార్కెట్లో వీటికి ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని అమ్మకాలు చేపట్టింది. పురుషులు, స్త్రీలకు మూడేసి రంగుల్లో కొత్త రబ్బర్‌ షూలను లాంచ్‌ చేసింది. ఈ రబ్బరు బూట్ల ధర పురుషులకు సుమారు రూ .30,660, మహిళలకు సుమారు రూ.34,000 గా నిర్ణయించింది. కంపెనీ పేరు తెలిసేలా వీటిపై జీజీ అనే లోగోను ముద్రించారు. 

లగ్జరీ బ్రాండ్ గా పేరుపొందిన గుస్సీ ఇటీవల భారతీయ కుర్తాను రూ .2.5 లక్షలకు అమ్మింది. 

Tagged Selling, Gucci, Rubber Shoes, Rs. 40 thousand 

Latest Videos

Subscribe Now

More News