పాకిస్థాన్ లో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అతిథిగా విచ్చేసిన ఒక వ్యక్తి టోపీని విసిరివేయడంతో అక్కడ గొడవ చెలరేగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పురుషులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం చూడవచ్చు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివాహానికి హాజరైన వారు టేబుల్‌ల వద్ద కూర్చుని విందును ఆస్వాదిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. అక్కడి పలు నిబంధనల ప్రకారం, ఓ తెల్లటి గుడ్డ పురుషులు, మహిళలు కూర్చునే ప్రాంతాన్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి పురుషుల టేబుల్ వద్దకు వచ్చి వారిలో ఒకరితో సంభాషించడాన్ని చూడవచ్చు. సంభాషణ మధ్యలో, అతను అతిథి టోపీని తిప్పి, అతిథులను ఒకరితో ఒకరు కొట్టుకునేలా చేశాడు. క్రమక్రమంగా అందులో చాలా మంది జోక్యం చేసుకున్నారు. కొద్దిసేపటికే, ఈ గొడవ మరో స్థాయికి చేరుకుంది. వారు ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకోవడం ప్రారంభించారు. తరువాత అందులోకి మహిళలు జోక్యం చేసుకున్నా వారి పోరాటం మాత్రం ఫలించలేదు.
ఈ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ X లో వైరల్ కావడంతో పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "పాకిస్థాన్ లో జరిగిన వివాహ వేడుకలో వడ్డించిన బిర్యానీలో మటన్ ముక్కలు రాలేదు" అనే శీర్షికతో ఈ పోస్టు షేర్ చేయబడింది. దీనికి 2వేల 6వందల కంటే ఎక్కువ లైక్‌లు, 3లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Kalesh during marriage ceremony in pakistan over mamu didn’t got Mutton pieces in biriyani pic.twitter.com/mYrIMbIVVx
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 29, 2023
