WPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ జెయింట్స్

WPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ జెయింట్స్

మహిళల ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ముంబై తొలి మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చింది.  తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి.

హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ సారథ్యం వహిస్తోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ముంబై ఇండియన్స్ తుది జట్టు: యాషికా భాటియా,హేలీ మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్),నేట్ స్క్రైవర్,పూజా వస్త్రాకర్,ఇసి వాంగ్,హుమైరా ఖాజీ,అమేలియా కెర్,అమంజోత్ కౌర్,జింటిమణి కలిత,సైకా ఇష్కే.

గుజరాత్ జెయింట్స్ తుది జట్టు: ఆష్లే గార్డనర్, బెత్ మూనీ (కెప్టెన్),సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, అనాబెల్ సదర్లాండ్, దయాళన్ హేమలత, జార్జియా వేర్‌హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మానసి జోషి, మోనికా పటేల్.