GT vs RR: ఐపీఎల్ 2026 క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ రోజు క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిన గుజరాత్ టైటాన్స్.. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. వరుస విజయాలతో జోష్‌లో ఉన్న రాజస్థాన్‌పై గెలవడం ఇప్పుడు గుజరాత్‌కి కత్తి మీద సాములా మారిపోయింది. గుజరాత్ కి వైభవ్ సూర్యవంశీ రూపంలో పెద్ద గండమే ముందుర ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 రన్స్ చేసి ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కొద్దీలో మిస్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ బౌలర్‌ను సైతం ఉతికారేసిన వైభవ్ కోసం ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.
గుజరాత్కి బౌలర్లే కీలకం:
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే తమ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసుకోవడం.. దాంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లే కీలకంగా మారనున్నారు. ముఖ్యంగా పేస్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, కగిసో రబడా పవర్ ప్లేలో 15 వండర్ కిడ్ ని అడ్డుకుంటే దాదాపు గుజరాత్ గెలుపు ఫిక్స్ అయినట్లే.. పవర్ ప్లేలో ఓపెనర్లను పెవిలియన్‌కు పంపిస్తే రాజస్థాన్ భారీ స్కోర్ చేసే ఛాన్స్ మాత్రం లేదు. వైభవ్ సూర్యవంశీతో పాటు యశస్వి జైస్వాల్, ధృవ్ జురేల్, రియాన్ పరాగ్, దాసున్ శనక, డోనోవాన్ ఫెరీరా కూడా మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ.. పవర్ ప్లేలో ఎంత కట్టడి చేస్తే మ్యాచ్‌పై అంత పట్టు సాధించే ఛాన్స్ గుజరాత్ కి దక్కుతుంది.
టాస్ గెలిస్తే గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్:
ఈ కీలక పోరులో టాస్ గెలిస్తే గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్వాలిఫయర్ 1లోనూ మొదట బౌలింగ్ చేసి భారీగా పరుగులు ఇచ్చుకుంది. దాంతో రాజస్థాన్ హిట్టింగ్ చూసిన అనంతరం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకునే ఆలోచనలో శుభ్ మన్ గిల్ ఉన్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 220+ పైగా స్కోర్ చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావొచ్చని యోచిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ మళ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 240, 250 చేస్తే గుజరాత్ గెలవడం కష్టం.
ALSO READ : గుజరాత్ vs రాజస్థాన్ మధ్య క్వాలిఫైయర్ 2 పోరు..
బ్యాటింగ్ లైనప్ డల్.. బౌలింగ్ పైనే ఆశలు:
గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ లైనప్ కూడా అంత మంచిగా లేదు. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ వికెట్లు పడిపోతే.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్లు జట్టుని ఆదుకునే అవకాశం కనిపించడం లేదు. దాంతో గుజరాత్ తమ బౌలర్లైనా కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్‌పైనే భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టీమ్ వైభవ్ సూర్యవంశీ నుంచి పొంచి ఉన్న గండాన్ని దాటి ఫైనల్‌లోకి అడుగు పెడుతుందో లేదో వేచి చూడాలి మరీ.
