DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్

DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్

ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు గుజరాత్ 8 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 8 మ్యాచ్ ల్లో మూడు విజయాలతో 8 వ స్థానంలో కొనసాగుతుంది.

ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ లో తలపడగా ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తు చేసింది. గుజరాత్ కెప్టెన్ గిల్ కు ఇది 100 వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. గుజరాత్ మార్పులేమీ లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఢిల్లీ రెండు మార్పులతో బరిలో దిగుతుంది. వార్నర్ స్థానంలో హోప్.. లలిత్ యాదవ్ స్థానంలో సమ్మిట్ కుమార్ ప్లేయింగ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు.    

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): 

పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్త్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్