
వాంఖడే వేదికగా మంగళవారం (మే 6) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ బ్లాక్ బస్టర్ పోరులో గెలిచిన జట్టు టేబుల్ టాపర్ గా నిలుస్తుంది. ముంబై 11 మ్యాచ్ లో 7 మ్యాచ్ ల్లో గెలిచింది. మరోవైపు గుజరాత్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 గెలిచింది. ఎవరు గెలిచినా 16 పాయింట్లు తమ ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్ కు చేరువవుతారు. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గుజరాత్ జట్టులో వాషింగ్ టన్ సుందర్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా