చనిపోయిన ఏడాదికి దొరికిన సూసైడ్ నోట్.. అందులో ఏముందంటే..!

చనిపోయిన ఏడాదికి దొరికిన సూసైడ్ నోట్.. అందులో ఏముందంటే..!

అహ్మదాబాద్: గుజరాత్‌‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఏడాదికి అతడి సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్ అతడి మృతికి కారణమైన వారిని పట్టించింది. వివరాలు.. మహేశ్ జాదవ్ అనే వ్యక్తి గతేడాది ఏప్రిల్ 9న ఆత్మహత్య చేసుకున్నాడు. నర్మదా నది తీరాన అతడి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మహేశ్ ఎందుకు చనిపోయాడనే విషయం మాత్రం అతడి తల్లి లీలా జాదవ్‌‌కు తెలియరాలేదు. తన కొడుకు హఠాత్తుగా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియక ఆమె కుమిలిపోయింది. అయితే రీసెంట్‌‌గా ఇంట్లో క్లీనింగ్ చేస్తుండగా మహేశ్ రూమ్‌‌లో కబోర్డ్‌‌లో ఒక లెటర్ ఆమెకు దొరికింది. ఆ నోట్‌‌ను 2019వ సంవత్సరం, ఏప్రిల్ 8న మహేశ్ రాశాడు. తాను చనిపోవడానికి ఏడాది ముందు అతడు ఆ లేఖను రాశాడు.

మహేశ్ వాడే కబోర్డ్‌కు దగ్గర్లో మడిచి ఉన్న బెడ్ షీట్‌‌లోని సదరు లెటర్‌‌లో తాను చనిపోవడానికి గల కారణాన్ని అతడు రాశాడు. తనను నపుంసకుడుగా నిరూపించడానికి తన భార్య మరొకరితో తన ముందే వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకుంటున్నట్లు మహేశ్ ఆ లెటర్‌లో రాశాడు. ఈ లెటర్ ఆధారంగా మహేశ్ భార్యతోపాటు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంగమ్ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. మహేశ్ మొదటి భార్య పెళ్లయిన కొన్నేళ్లకు అతడ్ని వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని కళ్యాణ్‌‌కు చెందిన అంబికా మరాతే అనే మహిళను మహేశ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ సంబంధాన్ని అంబికా బంధువు కిషోర్ భిల్‌‌ మహేశ్ దగ్గరకు తీసుకొచ్చాడు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకు వీరి సంసార జీవితం సాఫీగా సాగలేదు. సెక్స్ విషయంలో మహేశ్ ఇబ్బందులు పడటంతో అతడ్ని భార్య నపుంసకుడిగా పిలవడం మొదలుపెట్టింది.

అలాగే కిషోర్ భిల్‌‌తో మహేశ్ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. మహేశ్ ముందే భిల్‌‌తో ఆమె సెక్స్ చేసింది. దీని గురించి సదరు లెటర్‌‌లో మహేశ్.. ‘అక్రమ సంబంధాన్ని ముగించాలని వాళ్లిద్దరినీ (భార్య, షోర్ భిల్)‌కు సూచించా. వారి రిలేషన్‌‌ నన్ను చాలా బాధపెట్టింది. నేను చెప్పినా వాళ్లు వినలేదు. వాళ్లు నన్ను అవమానించడం కూడా మానలేదు. దీంతో నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా’ అని రాసుకొచ్చాడు. ఈ లెటర్ రాసిన దాదాపు ఏడాది తర్వాత గతేడాది ఏప్రిల్ 9న మహేశ్ కనిపించకుండా పోయాడు. తర్వాతి రోజు లఖ్తర్‌‌ అనే ప్రాంతానికి సమీపంలో నర్మదా కెనాల్‌‌లో మహేశ్ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. దాన్నో యాక్సిడెంటల్ డెత్‌‌గా భావించి పోలీసులు విచారణ ప్రారంభించారు. తాజాగా మహేశ్ తల్లికి అతడి సూసైడ్ నోట్ దొరకడంతో అసలు విషయం బయటపడింది.