సీఎం కేసీఆర్ పై కామెంట్స్ చేసిండని.. గల్ఫ్‌‌ కార్మికుడి అరెస్ట్

సీఎం కేసీఆర్ పై కామెంట్స్ చేసిండని.. గల్ఫ్‌‌ కార్మికుడి అరెస్ట్
  • శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లో దిగగానే పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌పై అసభ్యకర కామెంట్స్‌‌ చేశాడనే ఆరోపణలతో నిర్మల్‌‌ జిల్లాకు చెందిన గల్ఫ్‌‌ కార్మికుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్‌‌ నుంచి శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు వచ్చిన జే. గంగాధర్‌‌‌‌ను అదుపులోకి తీసుకుని సైబర్ క్రైమ్ పీఎస్‌‌కు తరలించారు. నిర్మల్‌‌ జిల్లాకు చెందిన జిడ్డు గంగాధర్‌‌ గల్ఫ్‌‌లో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. గతేడాది గల్ఫ్‌‌ కార్మికులపై సీఎం కేసీఆర్‌‌ చేసిన వ్యాఖ్యలకు గంగాధర్‌‌‌‌ కౌంటర్‌‌‌‌గా కామెంట్స్‌‌ చేశాడు. అవి సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌గా మారాయి. దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటో కేసు రిజిస్టర్‌‌‌‌ చేశారు. జూన్‌‌లో లుక్‌‌ ఔట్‌‌ నోటీసులు జారీ చేశారు. గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు చేరుకున్న గంగాధర్‌‌‌‌పై లుక్‌‌ ఔట్‌‌ నోటీసులు గుర్తించిన ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు హైదరాబాద్‌‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. దీంతో పోలీసులు శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులో గంగాధర్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. బషీర్‌‌‌‌బాగ్‌‌లోని సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్ పీఎస్‌‌కి తరలించారు. 41 సీఆర్‌‌‌‌పీసీ కింద నోటీసులు ఇచ్చి.. విచారణకు హాజరు కావాలని  పంపించినట్లు ఏసీపీ కెవీఎం ప్రసాద్‌‌ తెలిపారు.