ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా.. గుర్తుకొస్తున్నాయి మూవీ..

ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా.. గుర్తుకొస్తున్నాయి మూవీ..

విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి'. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జులై 3 నుంచి ఈటీవీ విన్‌‌లో స్ట్రీమింగ్ కానుంది. శనివారం ట్రైలర్‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్ నిర్వహించారు.  హీరో సత్యదేవ్, దర్శకులు బోయపాటి శ్రీను, కరుణాకరణ్, నిర్మాతలు మైత్రీ రవి, బన్నీ వాసు, ఎస్‌కేఎన్, ధీరజ్, వంశీ నందిపాటి అతిధులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. 

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌లో చూసినట్టు ఇందులో నా పాత్ర గతం మర్చిపోతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకుని, ఎన్నో భావోద్వేగ క్షణాలను ఎంతో అందంగా కనెక్ట్ చేశారు. గొప్ప జ్ఞాపకాలను, మంచి అనుభూతిని ఇచ్చే సిరీస్‌‌ ఇది’ అని చెప్పాడు. 

నిర్మాత శరత్ చంద్ర నాయుడు మాట్లాడుతూ ‘అల్లు అర్జున్‌‌ గారి పీఆర్‌‌‌‌గా, ఎగ్జిక్యూటివ్‌‌ ప్రొడ్యూసర్‌‌‌‌గా పనిచేసిన నేను, ఇప్పుడు నిర్మాతగా ఈ సిరీస్‌‌ చేయడం హ్యాపీ. ఆయన సపోర్ట్‌‌ ఎప్పటికీ మర్చిపోలేను. వెబ్ సిరీస్‌‌లకు అవార్డులు ఇస్తే, ఈ సిరీస్‌‌కు తప్పకుండా అవార్డులు వస్తాయి. విరాజ్ అంత చక్కగా నటించాడు’ అని చెప్పారు. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ సహా మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.