ఐదుగురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కథ హే చికీతా 

ఐదుగురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కథ హే చికీతా 

అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్‌‌‌‌, తన్మయి కుషి లీడ్ రోల్స్‌‌లో  ధన్ రాజ్ లెక్కల తెరకెక్కించిన చిత్రం ‘హే చికీతా’. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మిస్తున్నారు.  జులై 24న సినిమా విడుదల కానుంది.  శనివారం టీజర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. 

డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, జి. నాగేశ్వర్ రెడ్డి టీజర్‌‌‌‌ను లాంచ్ చేశారు. నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ, దర్శకులు నాగేశ్వర్ రెడ్డి, దశరథ్, రచయిత గోపీ మోహన్ అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. 

దర్శకుడు మాట్లాడుతూ ‘ఊర్లో ఉండే  ఐదుగురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారు అన్నది ఈ సినిమా కథ. రైతుల గురించి మాట్లాడే, ఆలోచించే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు. 21 రోజుల్లో షూటింగ్ పూర్తి అయిందని, అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని హీరోహీరోయిన్స్‌‌ అభినవ్‌‌, దివిజ ప్రభాకర్ చెప్పారు.  ఇలాంటి కొత్త కథల్ని అందించాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్‌‌‌‌ స్టార్ట్ చేశానని నిర్మాత గరుడవేగ అంజి  చెప్పారు.  టీమ్ అంతా పాల్గొన్నారు.