ఇంత దారుణమా.. క్యాబ్ బుక్ చేసింది.. డబ్బులు ఇమ్మంటే బెదిరించింది

ఇంత దారుణమా.. క్యాబ్ బుక్ చేసింది.. డబ్బులు ఇమ్మంటే బెదిరించింది

గురుగ్రామ్ సిటీలో ఓ మహిళ ఓలా క్యాబ్ డ్రైవర్ కు ఝలక్ ఇచ్చింది.  ఆమెకు ఎక్కడకు వెళ్లాలో తెలియదు.. చేతిలో ఫోన్ ఉంది కదా..  అని ఓలా క్యాబ్ బుక్ చేసింది.  వెంటనే ఓ క్యాబ్ ఆమె వద్దకు వచ్చింది. ఆమె చెప్పిన లొకేషన్ కు తీసుకెళ్లిన తరువాత.. మళ్లీ డెస్టినేషన్ మార్చింది.  ఇలా 13 గంటలు తిరిగింది.  ఇక డ్రైవర్ కు చిరాకెత్తడంతో...  ఎక్కడకు వెళ్లాలని గట్టిగా అడిగినా చెప్పకపోవడంతో చివరకు ఆ క్యాబ్ డ్రైవర్ సైబర్ సిటీలో డ్రాప్ చేశాడు.  తీరా డబ్బులు అడిగేసరికి ఆ మహిళ ఏం చేసిందో చూడండి...  

సాధారణంగా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు కస్టమర్లకు డ్రైవర్లు ఎక్కువ డబ్బులు ఇవ్వాలనో.. లేకపోతే రైడ్ క్యాన్సిల్ చేయడమో..  లాంటి ఘటనలు తరచూ వార్తల్లో చూస్తున్నాం.  కాని ఇప్పుడు రివర్స్ గా గురుగ్రామ్ లో ఓ మహిళ క్యాబ్ డ్రైవర్ కు ఝలక్ ఇచ్చింది.   

గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురుగ్రామ్ లోని సైబర్ సిటీలో ఓ మహిళ.. క్యాబ్ లో 13 గంటల పాటు ప్రయాణించింది. చివరికి క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడగడంతో తనపై వేధింపుల కేసు పెడతానని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి డబ్బులు కట్టకుండానే వెళ్లిపోయింది. సదరు మహిళ.. క్యాబ్ డ్రైవర్ తో, పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

జ్యోతి అనే మహిళ అర్ధరాత్రి ( జులై 25)  మేదాంత ఆస్పత్రి సమీపం నుంచి ఓలా యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నట్లు క్యాబ్ డ్రైవర్ దీపక్ తెలిపారు. అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ( జులై 25)    ఉదయం 11 గంటల వరకు ఒక చోటు నుంచి మరో చోటుకు తిప్పుతూనే ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇలా తరచూ డెస్టినేషన్లను మారుస్తూ ఉండటంతో.. అసలెక్కడికి వెళ్లాలో స్పష్టంగా చెప్పాలని అడిగానని, తను చెప్పకపోవడంతో సైబర్ సిటీలో డ్రాప్ చేసినట్లు దీపక్ చెప్పారు. ట్రిప్ ముగిసిన తర్వాత ఆ మహిళ డబ్బు ఇవ్వలేదని, గట్టిగా అడిగితే తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు ఆ క్యాబ్ డ్రైవర్ వాపోయాడు.

దీంతో గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు డ్రైవర్ దీక్. పేటీఎం ద్వారా చెల్లింపు చేస్తానని జ్యోతి చెప్పినప్పటికీ.. రెండు గంటలు వారిద్దరూ వాదించుకుంటూ అక్కడే ఉన్నారు.  ఇంతలో  దీపక్  ఫిర్యాదుతో  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ జ్యోతి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న మరో మహిళ రికార్డు చేసిన ట్విట్టర్ లో సదరు వీడియోను పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.  మరి జ్యోతి అనే మహిళపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారో వేచి చూడాలి.