సర్కార్ స్కూళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం

సర్కార్ స్కూళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం
  • గురుకుల పాఠశాలలు సీట్ల కోసం ఎమ్మెల్యేలు సిఫారసు చేసే స్థాయికి ఎదిగాయి
  • మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాముఖ్యత ఇస్తుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గురుకుల, కస్తూర్భా గాంధీ స్కూళ్లల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేలు రికమండేషన్ చేసే స్థాయికి చేరుకున్నాయన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల-జూనియర్ కాలేజ్ అదనపు తరగతి గదులను ప్రారంభించారు. హైస్కూల్ వరకు ఉన్న పాఠశాలను జూనియర్ కాలేజీ స్థాయికి పెంచడంపై మంత్రి అజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.