- గతేడాదితో పోలిస్తే 13 వేలు ఎక్కువ
హైదరాబాద్, వెలుగు: గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ సెట్–2026కు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 13 వేల అప్లికేషన్లు ఎక్కువ వచ్చాయని సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి మొత్తం 1,82,061 దరఖాస్తులు రాగా, గతేడాది 1,69,171 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. గురుకులాలపై తల్లిదండ్రులు, స్టూడెంట్లకు ఉన్న నమ్మకాన్ని ఈ అప్లికేషన్లు స్పష్టం చేశాయని ఆయన పేర్కొన్నారు.
తరగతుల వారీగా పరిశీలిస్తే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దరఖాస్తుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని వెల్లడించారు. ఇందులో 6వ తరగతికి అత్యధికంగా 15,464 దరఖాస్తులు రాగా, 7వ తరగతికి 1,828, 8వ తరగతికి 4,548, 9వ తరగతికి 1,195 దరఖాస్తులు అధికంగా వచ్చాయని కన్వీనర్ కృష్ణ ఆదిత్య వివరించారు.
