DL, JL అప్లైలో టెక్నికల్ సమస్యలు..గడువు పెంచాలని అభ్యర్థుల ఆందోళన

DL, JL అప్లైలో టెక్నికల్ సమస్యలు..గడువు పెంచాలని అభ్యర్థుల ఆందోళన

గురుకులాల డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాల కోసం  దరఖాస్తు గడువు మే 17వ తేదీ బుధవారంతో ముగియనుంది. అయితే గత 3 రోజులుగా గురుకుల వెబ్ సైట్ సర్వర్ సరిగా పని చేయకపోవడంతో అభ్యర్థుల ఆందోళనలో ఉన్నారు. DL, JL కి అప్లై చెస్తే సర్వర్ సమస్య వస్తుందని అభ్యర్థులు చెప్తున్నారు. టెక్నీకల్ ఇష్యూస్ ఉన్నాయని.. DL, JL దరఖాస్తు గడువు పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మే 17వ తేదీ అర్థరాత్రి 11.59 గంటల వరకు DL, JL అప్లికేషన్ స్వీకరణకు గడువు అని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు  ప్రకటించింది. 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి గురుకుల నియామక బోర్డు ఏప్రిల్ 17వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేసింది. గురుకుల నియామకాల్లో భాగంగా జూనియర్ కాలేజీల పరిధిలో 1,924 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు, 34 ఫిజికల్ డైరెక్టర్, 50 లైబ్రేరియన్ ఉద్యోగాలు,  డిగ్రీ కళాశాల పరిధిలో 793 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు, 39 ఫిజికల్ డైరెక్టర్. 36 లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

 జోనల్‌, మల్టీ జోనల్‌ వారీగా ఉన్న పోస్టుల వివరాలతోపాటు నిర్దేశిత విద్యార్హతల వివరాలను, ఎగ్జామ్‌ సిలబస్‌ తదితర అంశాలను ప్రకటించింది. ఈ పోస్టుల వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ 12 నుంచి ప్రారంభంకాగా, ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.  అప్లికేషన్లకు ఈ నెల 17వ తేదీ నుంచి మే 17 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఇస్తున్నట్టు బోర్డుగా ముందుగా పేర్కొంది. కానీ టెక్నికల్ సమస్యల కారణంగా అర్థరాత్రి 12 గంటల వరకు గడువు సమాయాన్నిపెంచింది. బోర్డు వెబ్‌‌సైట్‌‌లో (www.treirb.telangana.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.