ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నపుడే గురుకులాలు బాగున్నయ్ : ఎంపీ ఆర్. కృష్ణయ్య

ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నపుడే గురుకులాలు బాగున్నయ్ : ఎంపీ ఆర్. కృష్ణయ్య

ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నపుడే గురుకులాలు బాగున్నయ్ 
ఇప్పుడవి భ్రఘ్ట పట్టాయి 
ఒక్క  హాస్టల్ కు సొంత భవనం లేదు 
ఎంపీ ఆర్. కృష్ణయ్య విమర్శ 

హైదరాబాద్ :  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడే  గురుకులాలు బ్రహ్మాండంగా రన్ అయ్యాయని,  ఇప్పుడవి భ్రఘ్ట పట్టాయని రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం (జూన్ 10న)  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.  సీఎం కేసీఆర్ అధికారంలోకి  వచ్చిన తర్వాత ఒక్క గురుకుల పాఠశాల నిర్మించలేదని విమర్శించారు.  బీసీ హాస్టళ్లకు  సొంత భవనాలు లేవన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర కార్పొరేట్ కాలేజీలను రాష్ట్రం నుంచి తరిమికొడతామని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు ఆయా కలశాలల్లోనే ఫీజులు అధికామయ్యాయన్నారు. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచేందుకే ప్రభుత్వాలు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు.   

విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగినప్పుడే  విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు  అలవాటు అవుతాయన్నారు. గతంలో విద్యార్థి నాయకులే నేడు రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. అసెంబ్లీలో దొంగలు, రౌడీలు ఉంటే మేధావులు బయట ఉంటూ సమాజ సేవ చేస్తున్నారన్నారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు గుజ్జ కృష్ణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, పలు విద్యార్థి సంఘల నేతలు, తదితరులు పాల్గొన్నారు.