గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వారా గురుసింగ్ సభ అఫ్జల్‌గంజ్ ఆధ్వర్యంలో సోమవారం నగర్ కీర్తన్ నిర్వహించారు. అశోక్‌బజార్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు.. అఫ్జల్‌గంజ్, సిద్ధియాంబర్ బజార్, జంబాగ్, పుత్లీ బౌలి మీదుగా కొనసాగి గౌలిగూడ గురుద్వారాలో ముగిసింది. గురు గ్రంథ్ సాహిబ్‌జీని అలంకరించిన వాహనంలో నిషాన్ సాహెబాన్‌ల ప్రదర్శన, గట్కా యుద్ధ కళల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నవంబర్ 5న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో విశాల్ దీవాన్(సామూహిక సమ్మేళనం) నిర్వహించనున్నట్లు గురుద్వారా గురుసింగ్ సభ ప్రతినిధులు ఎస్.బల్దేవ్ సింగ్ బగ్గా, సత్వీందర్ సింగ్ బగ్గా, జస్పాల్ సింగ్ తుతేజా , జోగిందర్ సింగ్ ముజ్రాల్ తెలిపారు.
