
- టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడిన రెండు వెహికల్స్
- 11 మంది అరెస్టు, రూ.76 లక్షల విలువైన సరుకు సీజ్
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతుండగా రూ.కోట్లలో గడిస్తున్నారు. కర్ణాటక నుంచి సరుకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. గోదావరిఖనికి చెందిన నాగరాజు, శ్యాం కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి కరీంనగర్ కు రూ.2 కోట్ల విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్ల రెండు వ్యాన్లలో తీసుకొచ్చారు.
అక్కడ లోకల్ వ్యాపారులకు సుమారు రూ.1.30 కోట్ల విలువైన సరుకు అన్ లోడ్ చేశారు. మరో రూ.76 లక్షల విలువైన సరుకుతో హుస్నాబాద్ కు వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి వద్ద డీసీఎం, మినీ ట్రక్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాల్లో 304 బ్యాగులు లభించాయి. గాజుల అశోక్ నుంచి రూ.13,17,850 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. 11 మందిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.