కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఉందా..? : మండలి చైర్మన్ గుత్తా

కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఉందా..? : మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ జిల్లా : తెలంగాణ విద్యుత్ అమలుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం మానుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆరే.. బషీర్ బాగ్ విద్యుత్ కాల్పులకు కారణం అనడం అవగాహన లేకనే అని చెప్పారు. తొమ్మిదేళ్లలో ఎకరం పంట ఎక్కడైనా ఎండిందా..? సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలు జరిగాయా...? అని ప్రశ్నించారు. కరెంటు నిరంతరాయంగా సరఫరా అవుతుండడం వల్లే.. అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదన్నారు. ఎన్ఎల్ డీసీ నుండే కరెంటు కొనుగోళ్లు జరుగుతుందని, అవినీతి జరిగిందనడం రేవంత్ రెడ్డి అవివేకమే అని చెప్పారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. 

రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. హవాలా నెంబర్ వన్, స్థిమితం లేని వెంకట్ రెడ్డి వ్యవసాయం పేరుతో బావుల దగ్గరకు వెళ్లేది సురా పానకం కోసమే అంటూ వ్యాఖ్యలు చేశారు. 82 ఏళ్ల ఖర్గే ఏఐసీసీగా ఉండొచ్చు కానీ.. రిటైర్డ్ అయిన.. సమర్థత ఉన్న అధికారులు ఉద్యోగంలో కొనసాగకూడదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా...? అని ప్రశ్నించారు.