
- దాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నించాలి
- లీడర్ల మధ్య గ్యాప్మంచిది కాదు
- ఎంపీ టికెట్ఇస్తే నా కొడుకు పోటీ చేస్తడు
- పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు : ప్రజలతో బీఆర్ఎస్కు గ్యాప్వచ్చిందని, దాన్ని ఎలా పూడ్చుకోవాలో చూసుకోవాలే తప్ప లీడర్ల మధ్య గ్యాప్మంచిది కాదని శాసన మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కౌన్సిల్‌లోని తన చాంబర్లో మీడియాతో ఆయన చిట్చాట్చేశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో విభేదాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. పార్టీ కష్టకాలంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కేడర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. తన కుమారుడు అమిత్రాజకీయాలకు కొత్త, ప్రజలకు పరిచయం లేదని చెప్తున్న వాళ్లు కూడా ఎమ్మెల్యేలు కాకముందు ఎవరికీ తెలియదన్నారు.
తాను బీఆర్ఎస్అధిష్టానంపై నారాజ్ గాఉన్నానని, కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నానని సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అదే నిజమైతే తన కొడుకును బీఆర్ఎస్నుంచి ఎందుకు ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటానని ఆయన ప్రశ్నించారు. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి అవకాశం ఇచ్చినా తన కొడుకు ఎంపీగా పోటీ చేస్తాడని తెలిపారు.
టికెట్ఇవ్వకున్నా పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. తనను బుజ్జగించడానికి కేటీఆర్తన ఇంటికి రాలేదని.. తానే కలవాలని అనుకుంటున్నానని చెప్తే ఆయనే వచ్చి కలిశారన్నారు. తన కారణంగానే నల్గొండలో ఒక్క సీటు మాత్రమే గెలిచారని కొందరు అంటున్నారని, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో పార్టీ ఓటమికి కారణమెవరో చెప్పాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయ వాతావరణంతోనే ఓడిపోయామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు రివర్స్వేవ్ఉండొచ్చని అన్నారు. అయోధ్య రామాలయ ప్రభావంతో బీజేపీకి తెలంగాణలో మూడు, నాలుగు శాతం ఓట్లు పెరగొచ్చని.. ఉత్తర తెలంగాణతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఆ ప్రభావం ఎక్కువ ఉండొచ్చని అన్నారు.
బరిలో సోనియా ఉన్నా.. అమిత్పోటీ చేస్తడు
శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆ రెండు ప్రాజెక్టులు బోర్డు అధీనంలోకి వెళ్తే సాగునీటికే కాదు తాగునీటికీ ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. సాంకేతిక కారణాలతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ప్రాజెక్టును బీఆర్ఎస్ప్రభుత్వంలో పూర్తి చేయలేకపోయామన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీళ్లిచ్చే ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీసుకోవాలన్నారు. కౌన్సిల్ ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్కమిటీకి సిఫార్సు చేయాలని కోరారని, ఇంకా ప్రివిలేజ్కమిటీని నియమించలేదని, నియమించగానే రెఫర్చేస్తామన్నారు. బడ్జెట్సమావేశాలను పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో నిర్వహించేలా రిపేర్లు చేపట్టారని తెలిపారు.
నల్గొండ నుంచి సోనియాగాంధీ పోటీ చేసినా ఆమెపై అమిత్పోటీ చేస్తాడని గుత్తా స్పష్టం చేశారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టి రాజకీయాలకు అతీతంగానే వ్యవహరిస్తానన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. శాసన మండలిలో ప్రతిపక్షానికే ఎక్కువ మంది సభ్యులున్నారని, ఈ పరిస్థితుల్లో అధికారపక్షం వ్యవహరించే తీరుపైనే ప్రతిపక్షం స్పందన ఉండొచ్చని తాను భావిస్తున్నానని తెలిపారు.