Men Special : అబ్బాయిల్లో మూడ్ స్వింగ్స్.. అప్పటికప్పుడు మారిపోతున్నారంట..!

Men Special : అబ్బాయిల్లో మూడ్ స్వింగ్స్.. అప్పటికప్పుడు మారిపోతున్నారంట..!

ఆడపిల్లలా ఆ ఏడుపు ఏంటి? అమ్మాయిలా మాటిమాటికీ అలుగుతావు ఎందుకు? భయపడతావు ఎందుకు? ఈ మాటలు ఏదో ఒక సందర్భంలో ప్రతి ఇంట్లో వినపడేవే. కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. మరి దాంతో పాటు ఈ మాటలు కూడా మారాల్సిందే. ఎందుకంటే అందరూ అనుకునేంత వీక్ కాదు అమ్మాయిలు. ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేయడంలో అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోరు వాళ్లు. అబ్బాయిలకు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ స్టడీ కూడా చెబుతోంది.

అమ్మాయిలు, అబ్బాయిల డైలీ ఎమోషన్స్ మీద యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ఒక రీసెర్చ్ చేసింది. 75 రోజుల పాటు జరిగిన ఈ స్టడీలో మొత్తం 142 మంది అమ్మాయిలు, అబ్బాయిలు పార్టిసిపేట్ చేశారు. వాళ్లని గ్రూప్ లుగా చేసి పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎమోషన్స్ ని స్టడీ చేశారు. డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో వాళ్ల బిహేవియర్ ని గమనించారు.

రిజెల్ట్ చూస్తే అబ్బాయిల్లోనూ మూడ్ స్వింగ్స్ కనిపించాయి. రీసెర్చ్ లో భాగంగా వాళ్లకిష్టమైన స్పోర్ట్స్ లేదా యాక్టివిటీస్ చూపిస్తుంటే సిచ్యుయేషన్ బట్టి నిమిషం నిమిషానికి ఎమోషన్స్ మారాయి వాళ్లల్లో, పైగా అబ్బాయిలు, అమ్మాయిల ఎమోషన్స్ లో పెద్దగా తేడా కనిపించలేదు. ఒకింత అమ్మాయిలే బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టు కనిపించారు అంటున్నారు రీసెర్చర్లు.