Rebel OTT: OTTకి వచ్చేసిన పొలిటికల్ థ్రిల్లర్.. ప్రేమకథలో రాజకీయ మలుపులు

Rebel OTT: OTTకి వచ్చేసిన పొలిటికల్ థ్రిల్లర్.. ప్రేమకథలో రాజకీయ మలుపులు

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్(GV Prakash) హీరోగా వచ్చిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రెబల్(Rebel). ప్రేమలు బ్యూటీ మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు నిఖేష్ తెరకెక్కించారు. స్టూడెంట్స్ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో.. అథిర, కరుణాస్, ఆదిత్య భాస్కర్, షాలు రహీమ్ తదితరులు కీ రోల్స్ చేశారు.

1980 సంవత్సరంలో జరిగన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు నిఖేష్. చిత్తూరు, పాలక్కాడ్‌ ప్రాంతంలోని ఓ కళాశాల చుట్టూ సాగుతుంది ఈ సినిమా కథ. ఆ కళాశాలలో ఒకరైన కధీర్(జీవీ ప్రకాష్) మమిత బైజుతో ప్రేమలో పడతాడు. ఆ కారణంగా.. అప్పటి వరకు బాగానే ఉన్న విద్యార్థుల మధ్య గొడవలు ప్రారంభం అవుతాయి. ఆ గొడవలను వాడుకుని అక్కడి రాజకీయ నాయకులు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. మరి చివరకు జీవీ ప్రకాష్ ప్రేమ గెలిచిందా? రాజకీయనాయకులు విద్యార్థులతో చేసి చేసిన ఆకృత్యాలు ఏంటి? చివరకు ఆగొడవలు ఎక్కడికి దారితీశాయి అనేది రెబల్ మిగిలిన కథ.
 
ఈ సినిమా మార్చి 22న  విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయినప్పటికి కలెక్షన్స్ మాత్రం అంతగా రాబట్టలేకపోయింది ఈ మూవీ. దాంతో.. సినిమా విడుదలై నెల కూడా కాకముందే ఎలాంటి హడావుడి లేకుండా సడెన్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి మీకు థ్రిలర్ సినిమాలంటే ఇష్టం అయితే వెంటనే ఈ సినిమాను చూసేయండి.