తనపై జరిగిన దాడిపై స్పందించారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు. దాడి చేసింది ఎవరో తనకు తెలియదన్నారు. దాడి చేసిన వ్యక్తి పై చాలా ఆరోపణలుండటంతో ఐటీ రైడ్స్ జరిగాయని అన్నారు. తనపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. దాడి వెనుక ఏదో ఒక రాజకీయ పార్టీ హస్తం ఉందనేది తన అనుమానం అని అన్నారు.పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టాలని అన్నారు.
పార్టీలకు అతీతంగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని జీవీఎల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు హడావిడి తగ్గలేదని..చంద్రబాబు ఎన్నికల సంఘంపై అభ్యంతరకరంగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. రాజకీయ విమర్శలు చేసి తప్పించుకోలేరని అన్నారు జీవీఎల్ నరసింహరావు.
