ఆసియా సీనియర్‌‌‌‌ వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌.. జ్ఞానేశ్వరి డబుల్‌‌‌‌

ఆసియా సీనియర్‌‌‌‌ వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌.. జ్ఞానేశ్వరి డబుల్‌‌‌‌

గాంధీనగర్‌‌‌‌: ఇండియా వెయిట్‌‌‌‌ లిఫ్టర్‌‌‌‌ జ్ఞానేశ్వరి యాదవ్‌‌‌‌.. ఆసియా సీనియర్‌‌‌‌ వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో రెండు పతకాలతో మెరిసింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ 53 కేజీల్లో స్నాచ్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించిన జ్ఞానేశ్వరి.. ఓవరాల్‌‌‌‌గా 194 కేజీల బరువు ఎత్తి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. 

చైనా లిఫ్టర్‌‌‌‌ జిన్లాన్‌‌‌‌ జావో మొత్తం 216 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించింది. వియత్నాం క్రీడాకారిణి హోయ్‌‌‌‌ హువాంగ్‌‌‌‌ ఎన్గుయెన్‌‌‌‌ (195 కేజీ)కు సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ లభించింది. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో 28 ఆసియా దేశాలతో పాటు రెండు కామన్వెల్త్ దేశాల నుంచి మొత్తం 178 మంది లిఫ్టర్లు పాల్గొంటున్నారు. 2026 కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించేందుకు ఈ టోర్నమెంట్ అత్యంత కీలకం కానుంది.