జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే.. రెండు వారాల పాటు సర్వే

జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే.. రెండు వారాల పాటు సర్వే

అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తరువాత ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో ASI సర్వే శుక్రవారం (ఆగస్టు 4, 2023) ప్రారంభమైంది. జ్ఞాన్‌వాపి మసీదు హిందూ దేవాలయంపై నిర్మించబడిందా అని తెలుసుకోవడానికి భారత పురావస్తు శాఖ బృందం ప్రయత్నిస్తోంది. వారణాసి జిల్లా కోర్టు జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష్ జూలై 21 నుంచి క్యాంపస్‌లో ఏఎస్‌ఐ సర్వేకు అనుమతించారు. సర్వే నివేదికను ఆగస్టు 4 న సమర్పించాలని కోరారు. సర్వే ప్రారంభం కావాల్సిన రోజునే అంజుమన్ ఇంతేజామియా కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సర్వే వాయిదా పడింది. 

జులై 26 వరకు సర్వేపై మధ్యంతర స్టే విధించిన కోర్టు..అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేసుకోవాలని ముస్లిం పక్షాన్ని కోరింది. జులై 27న విచారణ అనంతరం హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. ఆగస్టు 3న జస్టిస్ ప్రితింకర్ దివాకర్ బెంచ్ ముస్లిం పక్షం పిటిషన్‌ను తిరస్కరించింది. జిల్లా కోర్టు నిర్ణయాన్ని న్యాయమైనది,సరైనదని సర్వేను ఆమోదించింది. మరోవైపు హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముస్లిం పక్షం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ(ఆగస్టు 4న) విచారణ చేపట్టనుంది.