హెచ్‌‌1బీ వీసా రూల్స్‌‌ మరింత కఠినం..మార్చి 30 నుంచి సోషల్‌‌ మీడియా అకౌంట్ల తనిఖీ తప్పనిసరి

హెచ్‌‌1బీ వీసా రూల్స్‌‌ మరింత కఠినం..మార్చి 30 నుంచి సోషల్‌‌ మీడియా అకౌంట్ల తనిఖీ తప్పనిసరి

వాషింగ్టన్‌‌: వీసా స్క్రీనింగ్‌‌ రూల్స్‌‌ను అమెరికా మరింత కఠినతరం చేసింది. హెచ్‌‌1బీ సహా పలు విభాగాల్లో వీసా కోరుకునే అభ్యర్థులు తన సోషల్‌‌ మీడియా అకౌంట్ల వివరాలను వెల్లడించడంతో పాటు పబ్లిక్ మోడ్‌‌లో ఉంచడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నెల 30 (సోమవారం) నుంచి ఈ రూల్స్‌‌ అమల్లోకి రానున్నట్లు అమెరికా స్టేట్‌‌ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. ఇందులో భాగంగా వీసా దరఖాస్తుదారులు సోషల్‌‌ మీడియా పోస్టులు, ఆన్‌‌లైన్‌‌ కార్యకలాపాలు, ఇతర డిజిటల్‌‌ రికార్డులను కాన్సులేట్‌‌ అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తారు.