హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో హెచ్సీఏ జీసీసీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో హెచ్సీఏ జీసీసీ

హైదరాబాద్​, వెలుగు​: యూఎస్​ ఆధారిత హెసీఏ హెల్త్​కేర్​ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన గ్లోబల్​ క్యాపబిలిటీ సెంటర్​ (జీసీసీ)ను బుధవారం ప్రారంభించింది. ఈ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 75 మిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టాలని, 2026 నాటికి మూడు వేల మంది నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వాలని యోచిస్తోంది. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్​ హెచ్​సీఏ హెల్త్​కేర్ కార్యకలాపాలలో ఆవిష్కరణ నైపుణ్యాన్ని పెంచడానికి అధునాతన డిజిటల్ టెక్నాలజీ సామర్థ్యాలను ఉపయోగిస్తుంది.  

ఐటీ, సప్లై చైన్​, ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌మెంట్, హ్యూమన్​ రిసోర్సెస్, ఫైనాన్స్​ అకౌంటింగ్​తో సహా పలు వ్యాపార విభాగాలలో ప్రతిభావంతులను నియమించుకోవడంపై  తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్​ బాబు ఈ సెంటర్​ను ప్రారంభించారు. ఈ సెంటర్​ ద్వారా హైదరాబాద్​ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణ కేంద్రంగా మారేందుకు మరింత వేగం పుంజుకుంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్ జీసీసీలకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు.