వరుణ్ ధావన్ హీరోగా, పూజాహెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా రిలీజ్ డేట్‌ను శుక్రవారం ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ 5న సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావలసి ఉంది.
కానీ అనుకోని కారణాలతో రెండు నెలలు ఆలస్యంగా వస్తోంది. ఇందులో మనీష్ పాల్, జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్, చుంకీ పాండే, రాకేష్ బేడీ, అలీ అస్గర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం మృణాల్.. అడివి శేష్ సినిమా ‘డకాయిట్’లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో తుమ్ హోతో, పూజా మేరీ జాన్ సినిమాలు కూడా చేస్తోంది. ఇక దుల్కర్ సల్మాన్‌కు జంటగా ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్న పూజాహెగ్డే.. తమిళంలో విజయ్ జననాయగన్, లారెన్స్ రాఘవ ‘కాంచన 4’లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్స్‌కు చేతిలో సినిమాలైతే ఉన్నాయి కానీ సక్సెస్ వచ్చి చాలా కాలమైంది. మరి వరుణ్ దేవన్‌తో కలిసి నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాతో ఆ విజయం లభిస్తుందేమో చూడాలి!
