హాయర్లో భారతీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్కు వాటా..డీల్ విలువ రూ.18వేల కోట్లు

హాయర్లో భారతీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్కు వాటా..డీల్ విలువ రూ.18వేల కోట్లు
  • వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ పింకస్​తో కలిసి 49 శాతం వాటా కొనుగోలు
  • డీల్​ విలువ రూ.17,995 కోట్లు

న్యూఢిల్లీ: భారతీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్, వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ పింకస్ సంస్థలు సంయుక్తంగా చైనా కన్జూమర్ అప్లయెన్సెస్ కంపెనీ హాయర్​ ఇండియాలో 49 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నాయి. ఈ డీల్​ విలువ రూ.17,955.5 కోట్లు హాయర్​ గ్రూప్​నకు మిగిలిన 49 శాతం వాటా ఉంటుంది. మిగతా వాటా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ టీమ్ వద్ద ఉంటుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తయారీ సామర్థ్యం పెంచి మార్కెట్ విస్తరణ చేపట్టనున్నారు. 

2025 నాటికి రూ.11 వేల కోట్ల ఆదాయం సాధించాలని హాయర్​ లక్ష్యంగా పెట్టుకుంది. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల రంగంలో మార్కెట్ వాటా పెంచుకోవాలని చూస్తోంది. జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన టీవీ అమ్మకాలు సంస్థ వృద్ధికి తోడ్పడుతున్నాయి.  

భారతీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్, వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ పింకస్ పెట్టుబడుల అనుభవం త వృద్ధికి తోడ్పడతాయని హాయర్​ భావిస్తోంది. 'మేడ్ ఇన్ ఇండియా' విజన్ కింద స్థానికంగా వనరుల సేకరణ, తయారీ సామర్థ్యాన్ని ఈ సంస్థలు పెంచనున్నాయి.