‘జో’ ఫేమ్ ఏగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి దర్శకుడు. ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఆదివారం ఉదయం కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా.డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ మూవీ డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకోవడం పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో సినిమా షూటింగ్ అప్‌డేట్స్, ఇతర వివరాలను తెలియజేస్తామని చెప్పారు.
