మెదక్, వెలుగు: వడగళ్ల వర్షంతో మెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారుల వివరాల ప్రకారం... రామాయంపేట, నర్సింగి, చేగుంట, శివ్వంపేట, హవేలీ ఘనపూర్, వెల్దుర్తి, చిన్న శంకరం పేట మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 4,367 మంది రైతులకు సంబంధించి వరి 4,701 ఎకరాల్లో, మొక్కజొన్న 12 ఎకరాల్లో, 20 మామిడి 63 ఎకరాల్లో, ఒక ఎకరం విస్తీర్ణంలో బొప్పాయి పంటకు నష్టం వాటిల్లింది.

