అన్నం వండే ముందు బియ్యాన్ని కడిగి.. కాసేపు నీటిలో నానపెట్టి ఆ తర్వాత వండుకుంటూ ఉంటారు. ఆ నీళ్లను పారబోస్తూ ఉంటారు. అలా చేయడం వలన మీరు చాలా పోషకాలు మిస్సయినట్టే.. బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు ఉంటాయి. ఆ నీటి వలన ఎన్ని ఉపయోగాలున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
బియ్యం నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, స్టార్చ్ ని మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మన అందాన్ని పెంచుకోవచ్చు. బియ్యం కడిగిన నీళ్లు పారబోయడం కంటే ఆ నీటిని ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
బియ్యం కడిగిన నీళ్లల్లో బోలెడన్ని పోషకాలు ఉంటాయని ముఖ్యంగా బీ విటమిన్, ఈ విటమిన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు కొద్దిపాటి గంజి కూడా ఉంటుందని చెబుతున్నారు.ఈ మన చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలను చేకూరుస్తుందని చెబుతున్నారు.
హెయిర్ బ్యూటీ : బియ్యం కడిగిన నీళ్లల్లో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు మన జుట్టు సంరక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయి. శుభ్రంగా తల స్నానం చేసిన తర్వాత జుట్టు పైన బియ్యం కడిగిన నీళ్లను పోసి మసాజ్ చేసుకుంటే అందులో ఉండే పోషకాలు మన జుట్టు కుదుళ్ళకు అందుతాయి. దీనివల్ల జుట్టు ఊడిపోవడం, చిట్లిపోవడం, సున్నితంగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టును కడిగేటప్పుడు ఈ నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా, మెరిసేలా, మృదువుగా మారుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. బియ్యం కడిగిన నీటిని జుట్టు రాయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలు చక్కగా అందుతాయి.
స్కిన్ బ్యూటీ : బియ్యం కడిగిన నీళ్లలో ఇనోసిటాల్, ఫిట్కి ఆసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. ముఖ్యంగా చర్మం రక్షించి తేమను ఇచ్చి చర్మం వాపును తగ్గిస్తాయి .వీటిలో ఉండే నియాసినమైడ్ నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.చర్మానికి రాస్తే ఎండ వల్ల కాలిన చర్మానికి చల్లదనం లభిస్తుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గించి ... తేమను అందించి ..చర్మం యవ్వనంగా ఉంచుతుంది. ఈ నీటిలో ఉండే మెగ్నిషియం చర్మం పిహెచ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ నీటిలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు చర్మంపై మురికిని తొలగిస్తాయి.
