
హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 26.
పోస్టుల సంఖ్య: 06.
పోస్టులు: ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ (ఏవియానిక్స్) 01, ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ (ఎయిర్ ఫ్రేమ్) 02, ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ (ఇంజిన్) 01, ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ (ఎయిర్ ఫ్రేమ్) 02.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ మెకానికల్ ఇంజినీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం మూడేండ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 26.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.200.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
►ALSO READ | ప్రసార భారతిలో కంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్..భారీగా జీతం