సైబర్ మీడియా రీసెర్చ్ : చిన్నా పెద్దా అందరూ మొబైల్ గేమ్స్ లోనే..

సైబర్ మీడియా రీసెర్చ్ : చిన్నా పెద్దా అందరూ మొబైల్ గేమ్స్ లోనే..

మొబైల్ గేమింగ్​తో టైమ్​పాస్

రోజులో సగం గంటలు ఆటకే..

సిటీలో లాక్ డౌన్ నుంచి చిన్నా పెద్దా ఇంట్రస్ట్

ఫ్రీ గేమ్స్ కన్నా  ప్రీమియం గేమ్స్ కే క్రేజ్

‘సైబర్ మీడియా రీసెర్చ్’ సర్వేలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లాక్​డౌన్​ టైం నుంచి చిన్నా, పెద్దా అందరూ మొబైల్ గేమింగ్ తోనే టైమ్ పాస్ చేస్తున్నారు. ఇది ఎంతలా అంటే రోజులో సగం టైమ్ అందులోనే గడిపేస్తున్నారు. 16 నుంచి 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. చాలామంది లాక్ డౌన్ నుంచే మొబైల్ గేమింగ్ కు అలవాటు పడిపోయారు.  అకేషనల్ గేమర్లు కూడా ఫుల్ టైమ్ గా  మారిపోయారు. హైదరాబాద్ సహా16 మెట్రో సిటీస్ లో ‘సైబర్ మీడియా రీసెర్చ్ ’ సంస్థ చేసిన సర్వే లో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి.

ఆటలో పడితే..

మొబైల్ గేమింగ్ కోసం గడిపే టైమ్ 6 నుంచి 8 గంలు ఉండేది. అది కూడా ఎక్కువగా పిల్లలే ఆడేవారు. వీకెండ్స్ , ఖాళీ టైమ్ ఉంటేనే పిల్లలు మొబైల్ గేమ్ ఆడేవారు. పెద్దల్లో కూడా చాలా మంది అప్పుడప్పుడూ వీటి జోలికి వెళ్తుండేవారు.  లాక్ డౌన్ నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం  పూర్తిగా తగ్గిపోయింది. పిల్లలకు స్కూల్స్ లేవు.  జాబ్​లు కోల్పోయిన వారు పనిలేక ఇంట్లోనే ఎక్కువ టైమ్ ఉంటున్నారు. గంటల తరబడి ఇంట్లో ఉండటంతో బోర్ ఫీలవుతున్న వారంతా అల్టర్ నేట్ గా దీన్ని ఎంచుకున్నారు. లాక్ డౌన్ నుంచి మొబైల్ గేమింగ్ కోసం స్పెండ్ చేసే టైమ్ ఏకంగా 10 నుంచి 12 గంటలకు చేరింది. ఆటలో పడితే టైమే తెలియకపోవడంతో చాలామంది బోర్, యాంగ్జైటీ  లను గేమ్ లు ఆడుతూ పోగొట్టుకుంటున్నారని సంస్థ సర్వే రిపోర్ట్​లో  పేర్కొంది.

ప్రీమియం గేమ్స్ పైనే క్రేజ్

వందల కొద్దీ ఫ్రీ మొబైల్ గేమ్స్ ఉన్నా చాలా మంది ప్రీమియం గేమ్స్ కే ఇంట్రెస్ట్ చూపుతున్నారు.  డబ్బులు పోయినా సరే మంచి టైమ్ పాస్ అని చెబుతున్నారు. హైదరాబాద్, ముంబై, కోల్ కతా, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ లో 16 – 35 ఏళ్ల ఏజ్​వారిలో 1200 మందిని సర్వే చేసింది.  అందులో 85 శాతం మంది ప్రీమియం గేమ్స్ కే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 15 శాతం మాత్రమే ఫ్రీ గేమ్స్ అడుతున్నారు. ఎక్కువగా యాక్షన్, అడ్వెంచర్ గేమ్స్ క్రేజ్ ఉంది. కరోనా కారణంగా అన్నిరంగాలు నష్టపోయినప్పటికీ మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ మాత్రం ఫుల్ గ్రోత్​లో లోకి వెళ్లిందని సైబర్ మీడియా రీసెర్చ్ హెడ్ ప్రభురామ్ తెలిపారు.

ఐదుగురిలో ముగ్గురు

లాక్​డౌన్​లో పార్ట్ టైమ్​ గేమర్లంతా ఫుల్ టైమ్​కు మారిపోయారు.  పిల్లలతో కలిసి మొబైల్ గేమ్ లు ఆడటమే కాక  ఫ్రెండ్స్, రిలేటివ్స్ కు కూడా వీటిని డౌన్ లోడ్ చేసి ఆడమని మెస్సేజ్ లు చేస్తున్నారు.  దీంతో మొబైల్ గేమింగ్ కు పబ్లిసిటీ కూడా పెరిగిపోయింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఆడుతున్నారని సంస్థ రిపోర్ట్​లో తెలిపింది. వీడియో గేమ్ లకు సంబంధించి కూడా వీరిలో మంచి అవగాహన ఏర్పడిందని పేర్కొంది. ప్రతి ఒక్కరి మొబైల్ లో కనీసం ఏడు గేమ్స్ ఉంటున్నాయంది. వాటిలో నాలుగింటిని ప్రతి రోజు ఓపెన్ చేసి ఆడుతున్నారని చెప్పింది.

గేమింగ్​తో లోన్లీ నెస్ పోయింది..

లాక్ డౌన్ టైమ్​లో బోర్ గా ఉండడంతో మొబైల్ గేమింగ్ ఎలా ఆడాలో తెలుసుకున్నా. మా అక్క ద్వారా గేమ్​ ఆడడం నేర్చుకున్నా. ఇప్పుడు లూడో గేమ్ ఆడుతున్నా. గేమ్ ఆడుతున్నంతా సేపు టైమ్ తెలియదు. లాక్ డౌన్ లో బోర్ లేకుండా మొబైల్ గేమింగ్ తో గడిపోయింది.
– మోనీ, స్టూడెంట్, మణికొండ

ఖాళీ టైమ్ ఉండగా..

లాక్ డౌన్ లో  ఆన్ లైన్ క్లాస్ లు అయిపోయాక ఏం చేయాలో తెలియ లేదు.  ఫ్రెండ్స్ తో కలిసి గ్రూప్ గా ఏర్పడి  గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశా. ఇప్పుడు బయటకు వెళ్లినా కూడా గేమ్స్ ఆడటం కంపల్సరీ అయిపోయింది.

– హరి, స్టూడెంట్, సికింద్రాబాద్ 

For More News..

మెయిన్స్​లో మెరవాలంటే ఈ టిప్స్ ఫాలోవ్వండి

న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడాలి

తెలంగాణ యువత గోస కనబడతలేదా?

దుబ్బాక రిజల్ట్స్​ ప్రకటించొద్దు