బందీల పిల్లల్ని ఆడిస్తున్న మిలిటెంట్లు!

బందీల పిల్లల్ని ఆడిస్తున్న మిలిటెంట్లు!

వందలాది మంది ఇజ్రాయెల్‌‌ ప్రజలను చంపి, 150 మందిని బందీలుగా చేసుకున్న హమాస్ మిలిటెంట్లు.. ఇప్పుడో ప్రాపగండా వీడియోను రిలీజ్ చేశారు. తమ వద్ద బందీలుగా ఉన్న వారి పిల్లలను ఆడిస్తున్నట్లుగా ఉన్న వీడియోను టెలిగ్రామ్​లో షేర్ చేశారు. 

అందులో ఓ మిలిటెంట్​ భుజానికి ఏకే 47 వేలాడదీసుకుని, అటొకరు ఇటొకరు చిన్నారులను ఎత్తుకుని కనిపించాడు. వీల్‌‌ చైర్‌‌‌‌లో ఏడుస్తున్న చిన్నారిని కొందరు బుజ్జగించడం కనిపించింది. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని మరో మిలిటెంట్‌‌ కెమెరా ముందుకు వచ్చాడు.