దిగొచ్చిన హమాస్ తీవ్రవాదులు : ఇజ్రాయేల్తో చర్చలకు రెడీ

దిగొచ్చిన హమాస్ తీవ్రవాదులు : ఇజ్రాయేల్తో చర్చలకు రెడీ

ఇజ్రాయెల్ సైన్యానికి, హమాస్ తీవ్ర వాదులకు మధ్య భీకర యుద్దం సాగుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఆకస్మిక దాడులు చేసిన హమాస్ తీవ్రవాదులు దాదాపు 900 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపేశారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదులను మట్టు బెట్టింది. అయితే హమాస్ తీవ్ర వాద సంస్థ ఇజ్రాయిల్ తో చర్చలకు దిగొచ్చినట్లు తెలుస్తోంది. 

హమాస్ తీవ్రవాద సంస్థలోని పాలస్తీనా సీనియర్ సభ్యుడు అబు మర్జౌక్ ఇజ్రాయెల్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు.  

మరోవైపు సోమవారం ( అక్టోబర్ 9) గాజాలో అనేక హమాస్ స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విమానం దాడులు  చేశాయి. ఈ దాడుల్లో హమాస్ ఉగ్రవాదులు ఉన్న భవనం, మసీదు లోపల వారికున్న సదుపాయాలపై దాడులు చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఉపయోగించే టన్నెల్ షాఫ్ట్ దాడి జరిగింది. 
హమాస్ ఆపరేషనల్ స్థావరాలపై మసీదుపై ఐడీఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విమానం దాడి చేసి ధ్వంసం చేసింది. గాజాలోని హమాస్ ఆయుధ గోడౌన్ల కూడా దాడులు  చేశారు. 

గత మూడు రోజులుగా హమాస్ తీవ్రవాదులు చేస్తున్న దాడుల్లో 900 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారని, 30 మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలు తెలిపాయి. మొత్తం 1290 హమాస్ లక్ష్యాలపై దాడులు చేసినట్లు  బలగాలు తెలిపాయి.