ప్రతి కారులో రెండు, మూడు డెడ్‌‌బాడీలు

ప్రతి కారులో రెండు, మూడు డెడ్‌‌బాడీలు
  • ప్రతి కారులో రెండు, మూడు డెడ్‌‌బాడీలు
  • ఇజ్రాయెల్‌‌ మ్యూజిక్‌‌ ఫెస్టివల్‌‌లో హమాస్‌‌ అరాచకాలు వెలుగులోకి

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌‌లో మ్యూజిక్‌‌ ఫెస్టివల్‌‌పై హమాస్‌‌ టెర్రరిస్టులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఊచకోత ఘటన నుంచి బయటపడిన వారు ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నారు. ఫెస్టివల్‌‌కు హాజరైన చాలా మందిని చంపేశారని, కార్లలో పారిపోతున్న వారిని కూడా వదిలిపెట్టలేదన్నారు. ఒక్కో కారులో రెండు నుంచి మూడు డెడ్‌‌బాడీలను అధికారులు గుర్తించారు. ఈ నెల 7న గాజా సరిహద్దుకు దగ్గరగా మ్యూజిక్‌‌ ఫెస్టివల్‌‌ ఏర్పాటు చేశారు. 

ఈ ప్రోగ్రామ్‌‌కు వందల మంది హాజరయ్యారు. ఆ రోజు ఉదయం 6.30 గంటల సమయంలో ఆ ప్రాంతం అంతా మ్యూజిక్‌‌ సౌండ్‌‌తో మారుమోగుతోంది. అయితే, సడెన్‌‌గా మ్యూజిక్‌‌ ఆగిపోయింది. మైక్‌‌లో ‘రెడ్‌‌ అలర్ట్‌‌’ అని ప్రకటించారు. అప్పటికే కొంతమంది హమాస్‌‌ టెర్రరిస్టులు వారి గుంపులో ఉన్నారు. మరికొందరు నడుచుకుంటూ, బైక్‌‌లపై వచ్చారు. వస్తూనే సెక్యూరిటీగా ఉన్న గార్డులను, పోలీసులను షూట్‌‌ చేశారు. 

కాల్పుల శబ్దం వినబడటంతో అక్కడ ఉన్న వారంతా ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. కార్లలో పారిపోతున్న వారిని సైతం వెంబడించి మిలిటెంట్లు షూట్‌‌ చేశారు. ఈ ఘటనలో 270 మంది మరణించారు. డజన్ల కొద్దీ వెహికల్స్ కాలిపోయాయి. ఘటనా ప్రాంతంలో స్లీపింగ్‌‌ బ్యాగ్‌‌లు, షూస్‌‌, కూలర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. భద్రతా దళాలు చేరుకునే లోపే టెర్రరిస్టులు విధ్వంసం సృష్టించి వెళ్లిపోయారు.