లైంగిక్ వేధింపుల కేసులో.. హనుమకొండ సీసీఎస్‌‌‌‌ ఎస్సై అరెస్ట్‌‌‌‌

లైంగిక్ వేధింపుల కేసులో.. హనుమకొండ సీసీఎస్‌‌‌‌ ఎస్సై అరెస్ట్‌‌‌‌

హనుమకొండ, వెలుగు : లైంగిక వేధింపుల కేసులో హనుమకొండ సీసీఎస్‌‌‌‌ రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. ఆదివారం రిమాండ్‌‌‌‌ చేసి, పరకాల సబ్‌‌‌‌జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ 2022లో హనుమకొండ పీఎస్‌‌‌‌లో ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ తన భర్త హింసిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఎస్సై రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఆ మహిళకు విడాకులు ఇప్పించి, ఆమెతో చనువు పెంచుకున్నాడు. అనంతరం పెండ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేండ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మహిళ గర్భవతి కావడంతో అబార్షన్‌‌‌‌ చేయించాడు. తర్వాత తనను పెండ్లి చేసుకోవాలని మహిళ కోరడంతో ఎస్సై ఒప్పుకోకపోగా మళ్లీ వేధించడం మొదలుపెట్డాడు. దీంతో సదరు మహిళ ఈ నెల 12న డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వరంగల్ సీపీ ఆదేశాలతో విచారణ చేపట్టిన హనుమకొండ పోలీసులు ఎస్సై రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ను శనివారం అదుపులోకి తీసుకొని, ఆదివారం  రిమాండ్‌‌‌‌కు తరలించారు. రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ హనుమకొండ పీఎస్‌‌‌‌ నుంచి ఎల్కతుర్తికి ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయ్యాడు. అక్కడ ఓ ల్యాండ్‌‌‌‌ విషయం జోక్యం చేసుకోవడంతో సస్పెండ్‌‌‌‌ అయ్యాడు. తర్వాత హనుమకొండ సీసీఎస్‌‌‌‌ ఎస్సైగా నియామకం 
అయ్యారు.