బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి :  కలెక్టర్ ప్రావీణ్య

బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి :  కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ, వెలుగు: వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా బ్యాంకులు జిల్లాకు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ లో మంగళవారం జిల్లాలోని వివిధ బ్యాంకుల, వివిధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. 2024--25 ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.7,413 కోట్లు కాగా, రూ.6,214 కోట్లు బ్యాంకుల వారీగా  రుణాలు ఇవ్వగా, వ్యవసాయ, వ్యవసాయేతర, పరిశ్రమలు, ఆర్సెటీ, పీఎంఈజీపీ, ఆర్థిక అక్షరాస్యత, డీఆర్డీఏ, మెప్మా మహిళా సంఘాల బ్యాంకు లింకేజీ, బ్యాంకులవారీగా అందించిన రుణాలు, ఆర్థిక లక్ష్యాల ప్రణాళిక, తదితర అంశాలపై సమీక్షించారు.  

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దామెర మండలానికి సంబంధించి బ్యాంకును ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం  లబ్ధిదారుల ఎంపికకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్​చార్జి అడిషనల్ కలెక్టర్ మేన శ్రీను, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, నాబార్డ్ ఏజిఎం చైతన్య రవికుమార్, ఆర్బీఐ ఆఫీసర్  తానియా, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.