అమ్మవారి ఆలయ హుండీలో ఇరికిన చేయి

అమ్మవారి ఆలయ హుండీలో ఇరికిన చేయి
  •    డబ్బులు దొంగిలించేందుకువాచ్​మన్​ ప్రయత్నం
  •     కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో ఘటన  

భిక్కనూరు,  వెలుగు :  కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లిలో ఓ వ్యక్తి ఆల యంలోని హుండీలో చోరీకి యత్నించగా చేయి ఇరుక్కుపోయింది. రామేశ్వరపల్లికి చెందిన సాయిలు శివారులోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టడం, కోళ్లు కోయడంతో పాటు వాచ్​మన్​గా పని చేస్తుంటాడు. మంగళవారం రాత్రి ఆలయం మూసిన తర్వాత హుండీలో భక్తులు వేసిన డబ్బులు దొంగిలించడానికి చేయి పెట్టాడు.

ALSO READ ; బిట్​ బ్యాంక్​: సామంత కాకతీయులు 

డబ్బులు దొరికినా చేయి బయటకు తీద్దామంటే రాలేదు. అందులోనే ఇరుక్కుపోవడంతో ఉదయం వరకు అలాగే ఉన్నాడు. పొద్దున దర్శనానికి వచ్చిన భక్తులు చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. వారు హుండీ ద్వారాన్ని గడ్డపారలతో వెడల్పు చేయడంతో చేయి బయటకు వచ్చింది. సాయిలును పోలీసులకు అప్పజెప్పారు.