బిట్​ బ్యాంక్​: సామంత కాకతీయులు

బిట్​ బ్యాంక్​: సామంత కాకతీయులు
  •  మాగల్లు శాసనం తూర్పుచాళుక్య రాజు దానార్ణవుడు వేయించాడు.
  •     అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనాన్ని రుద్రదేవుడు (క్రీ.శ.1063)లో వేయించాడు.
  •     ద్రాక్షారామం శాసనం రెండో ప్రోలరాజు మంత్రి ఇనంగాల బ్రహ్మిరెడ్డి వేయించాడు. 
  •     ఖమ్మం జిల్లాలోని బయ్యారం శాసనం వేయించింది గణపతిదేవుని సోదరి కాకతి మైలాంబ.
  •     రుద్రమదేవి బంటు పువ్వుల ముమ్మడి చందుపట్ల శాసనం వేయించాడు.
  •     నెల్లూరు జిల్లాలోని త్రిపురాంతకం శాసనం రుద్రమదేవి అధికారి అంబదేవుడు వేయించాడు. 
  •     సకలవీడు శాసనం రెండో ప్రతాపరుద్రుడు వేయించాడు. 
  •     మల్యాపురం శాసనం గణపతిదేవుడు వేయించాడు. 
  •     మహబూబ్​నగర్​ జిల్లాలోని కొలనుపల్లి శాసనం రెండో ప్రతాపరుద్రుడు వేయించాడు. 
  •     మొదటిసారిగా కాకర్త్యగుండన, అతని మూడు తరాల పూర్వీకుల ప్రశస్తి మాగల్లు శాసనంలో ఉంది. 
  •     పలువురు చరిత్రకారుల వాదన ప్రకారం కాకతీయవంశ మూలపురుషుడు కాకర్త్యగుండన.
  •     కాకతి అనే జైన మాతృ దేవతను పూజించడం వల్ల కాకతీయులకు ఆ పేరు వచ్చిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. 
  •     వినుకొండ వల్లభరాముని క్రీడాభిరామంలో కాకతి విగ్రహం ప్రస్తావన ఉంది. 
  •     ఢిల్లీ సుల్తానుల సైన్యాలు వరంగల్​ కోటలోని కాకతి విగ్రహాన్ని ధ్వంసం చేయగా, కాకతి రాజ్య పద్మపీఠి అయిన ఆ దేవత విగ్రహాన్ని షితాబ్​ఖాన్​ పున:ప్రతిష్ట చేశాడని షితాబ్​ఖాన్​ వేయించిన శాసనం తెలుపుతుంది. 
  •     తొలి కాకతీయులను చరిత్రకారులు సామంత కాకతీయులు అని వర్ణించారు. 
  •     సామంత కాకతీయుల్లో మొదటివాడు కాకర్త్యగుండన.
  •     కాకర్త్యగుండన మొదలుకొని మొదటి రుద్రుడు లేదా రుద్రదేవుడి వరకు సామంత కాకతీయులు అంటారు. 
  •     సామంత కాకతీయులు నేటి కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం ప్రాంతాలను పాలించారు. 
  •     కాకతీయుల్లో మొదటి సార్వభౌముడు రుద్రదేవుడు. 
  •     కాకర్త్యగుండన రాష్ట్రకూట రాజైన రెండో కృష్ణుడి తరఫున వేంగిపై జరిగిన దండయాత్రలో పాల్గొన్నాడు. 
  •     బెజవాడ దుర్గాన్ని వేంగి చాళుక్యుల నుంచి రాష్ట్రకూట రెండో కృష్ణుడు ఆక్రమించడంలో కాకర్త్యగుండన కీలక పాత్ర పోషించాడు. 
  •     వేంగి చాళుక్యులతో జరిగిన పెరువంగూరు యుద్ధంలో కాకర్త్యగుండన ప్రాణాలు కోల్పోయాడు. 
  •     కాకర్త్యగుండన ధైర్య సాహసాలకు మెచ్చి రాష్ట్రకూట రాజు గుండను కొడుకైన ఎరియను కురివాడి సీమకు అధిపతిగా నియమించాడు. 
  •     తెలంగాణలో మొదటిసారిగా కాకతీయుల పాలన ఎరియ కురివాడి పాలకునిగా నియమించడంతో ఆరంభమైంది.
  •     శత్రువును చంపి, సింహాసనాన్ని శత్రువుల బారి నుంచి రక్షించి బేతరాజును కాకతీయపురంలో విరియాల ఎర్రభూపతి ప్రతిష్టించింది. 
  •     కళ్యాణి చాళుక్యులకు బేతరాజుకు సామంతునిగా ఉన్నారు. ఆయన బిరుదు కాకతిపురాధినాథ.
  •     ఖాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు మొదటి ప్రోలరాజు గురించి తెలుపుతాయి. 
  •     మొదటి ప్రోలరాజుకు అనుమకొండ విషయాన్ని వంశపారంపర్య హక్కుగా ఇచ్చి, సామంతునిగా కళ్యాణి చాళుక్య చక్రవర్తి సోమేశ్వరుడు గుర్తించాడు.
  •     చోళుల ఆధీనంలో ఉన్న చక్రకూటం కోటను విడిపించి, ప్రోలరాజు కళ్యాణి చాళుక్యులకు అప్పగించాడు. 
  •     మొదటి ప్రోలరాజు అనంతరం రాజ్యానికి రెండో బేతరాజు వచ్చాడు.
  •     రెండో బేతరాజు బిరుదులు త్రిభువనమల్ల, విక్రమ చక్రీయ, మహామండలేశ్వర. 
  •     రెండో బేతరాజు మంత్రి వైజాండాధీశుడు. 
  •     ఆరో విక్రమాదిత్యుడు వేంగిని ఆక్రమించడంలో వైజాండాధీశుడు పాత్రకు మెచ్చి రెండో బేతరాజు 1000 సబ్బిసాయిర మండలం అప్పగించారు. 
  •     రెండో బేతరాజు ఆధ్యాత్మిక గురువు రామేశ్వర దీక్షితులు. 
  •     రెండో బేతరాజు 1108లో మరణించగా, సింహాసనం అధిష్టించిన అతని కుమారుడు దుర్గరాజు.
  •     సామంత కాకతీయుల్లో రెండో శక్తిమంతమైన రాజు రెండో ప్రోలరాజు.
  •     రెండో ప్రోలరాజు తన రాజ్య భూభాగాలకు సరిహద్దులో ఉన్న కళ్యాణి చాళుక్య సామంతులతో యుద్ధం చేసి విజయం సాధించినట్టు తెలియజేసే శాసనం రుద్రదేవుని అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం. 
  •     రెండో ప్రోలరాజు మిత్రుడైన కళ్యాణి చాళుక్య రాజు రెండో జగదేకమల్లుడు.
  •     శ్రీశైలం వరకు తన సైన్యాలను నడిపి అక్కడ విజయస్తంభాన్ని నాటిన కాకతీయ రాజు రెండో ప్రోలరాజు.
  •     తెలంగాణలో కళ్యాణి చాళుక్యుల ప్రాచుర్యానికి అడ్డుకట్ట వేసి, కాకతీయులను బలోపేతమైన శక్తిగా తీర్చిదిద్దిన కాకతీయ రాజు రెండో ప్రోలరాజు.