
కలియుగ వైకుంఠం తిరుమల తరచూ వివాదాలకు వేదిక అవుతోంది. దేవదేవుడి సన్నిధిలో వరుస వివాదాలు తలెత్తుతుండటం పట్ల శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీలో వెయ్యి మంది పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. టీటీడీలో ఉన్న వెయ్యి మంది అన్యమత ఉద్యోగులను తొలగించాలని హెచ్చరించారు బండి సంజయ్. ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలను ఆక్షేపిస్తున్నామని.. ఆయన వ్యాఖ్యలు శ్రీవారి ఆలయంపై డాడిలా ఉందని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
టీటీడీలో 22 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించామని 6 నెలల క్రితం టిటిడి బోర్డు ప్రకటించిందని.. ఇప్పుడు బండి సంజయ్ మాత్రం వెయ్యి మందికి పైగా ఉన్నారని చెబుతున్నారని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానం ఉందని.. శ్రీవారి ఆలయ ప్రతిష్ట మంట గలపడంతోపాటు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు భూమన.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పరిశీలనలో ఉంటే తెలపాలని.. దాదాపు 20 శాతం మంది ఉద్యోగులు టిటిడి లో అన్నమతస్తులు ఉన్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యల సారాంశం. ఉందని అన్నారు. టిటిడి ని ప్రక్షాళన చేస్తున్నామంటున్న కూటమి ప్రభుత్వం బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తుందా అని ప్రశ్నించారు భూమన.
బండి సంజయ్ చేసిన హెచ్చరిక 24 గంటలు అయ్యిందని.. ఇప్పటిదాకా టిటిడి చైర్మన్, ఈఓ, ప్రభుత్వం, డిప్యూటీ సీఎం ఖండించలేదని అన్నారు.కేంద్ర మంత్రి ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు భూమన. టీటీడీ ఉద్యోగులను, పాలక మండలని అవమానపరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.