
సోషల్ మీడియా ఫేమ్.. సెలబ్రెటి అవ్వాలి.. ప్రపంచం అంతా తన గురించి చర్చించుకోవాలని జనాలు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ట్రైన్స్ లో రీల్స్.. డ్యాన్స్ లు చేయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం షేర్ లు.. లైక్స్.. కామెంట్స్ లో కాలక్షేపం చేయడం ఇలా అలవాటుగా మారింది. తాజాగా ఓ అమ్మాయి రన్నింగ్ ట్రైన్‌లో డోరు దగ్గర నిలబడి ప్రమాదకర స్థితిలో రీల్స్ చేస్తుంది. ఈ పరిశీలన గమనించిన ఆమె తల్లి జుట్టు పట్టుకుని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు.. ఇంకా మారం చేస్తే కొట్టి దారిలో పెట్టేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు అలానే ట్రైన్‌లో ప్రయాణిస్తున్న కూతురు చిలిపి చేష్టలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలనుకున్న ఆమె తన్నులు తిన్నది.
రన్నింగ్ ట్రైన్‌లో ఓ అమ్మాయి డోర్ దగ్గర నిలబడి ప్రమాదకర స్థితిలో రీల్స్ చేస్తుంది. ఏ మాత్రం స్లిప్అయినా ప్రాణాలు పోతాయి. ఈ పరిశీలన గమనించిన ఆమె తల్లి వెంటనే డోరు దగ్గరకు వచ్చింది. జుట్టు పట్టుకొని చంపలపై ఎడా పెడా కొట్టింది. ఇది ఎంత ప్రమాదం.. ఇలా రీల్స్ చేయడం అంటూ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ALSO READ : ఇవి రోజుకు రెండు తినండి.. డాక్టర్ కు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదు..!
ఈ వీడియో mr_rahul_razz అనే స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్ల మంది వీక్షించారు. చాలామంది లైక్ చేశారు. ఇకపై నెటిజన్లు స్పందించారు. ప్రతి ఒక్కరికి అలాంటి మదర్ ఉంటే యూత్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయరు అని ఒకరు రాశారు. ఇంకొకరు ఇలాంటి తెలివితక్కువ పిల్లల నుంచి ఫోన్లు .. కెమెరాలను లాక్కోవాలి అని రాశారు. భవిష్యత్తులో పెద్దగా హాని జరగకుండా.. కూతురి భద్రత.. భవిష్యత్తు కోసం తల్లి బాధ్యతాయుతంగా ఈ చర్య తీసుకుందని చాలా మంది అంటున్నారు.