
వర్షాకాలం కొనసాగుతుంది. జనాలను రోగాలు పీడించే కాలం ఇది. బాడీ పెయిన్స్.. నీరసం..బద్దకం .. ఉత్సాహం లేకపోవడం ఇలా అనేక సమస్యలతో జనాలు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలను పుదీనాతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పుదీనా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. . . !
పుదీనాలోని ఔషధగుణాల కారణంగా పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తున్నారు. దీనిలోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. వానలో తడవడం వలన అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. జలుబు.. దగ్గు.. తుమ్ములు శ్వాశ ఆడకపోవడం వంటి వాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో అలెర్జీ సమస్యలు కూడా పెరుగుతాయి.
పుదీనా తో ఇలాంటి సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకు మీ రోజువారీ ఆహారంలో పుదీనా చేర్చుకోవాలని చెబుతున్నారు. తద్వారా ఈ రకమైన సమస్యలన్నీ నివారించవచ్చట.
ALSO READ : శివుడికి ఇవి సమర్పించండి... వెంటనే పెళ్లి సంబంధం కుదురుతుంది.
ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం .. పుదీనా ఆరోగ్యకరమైన మూలిక. రోజుకు రెండు ఆకులు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీన్ని వాడటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పుదీనా ఆకులలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. పుదీనా ఆకులలో ఉండే పోషకాలు కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. దీని రసం చేదుగా ఉన్నప్పటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. మీరు దీని రసం తాగలేకపోతే, రెండు, మూడు తాజా పుదీనా ఆకులను నమిలి తినవచ్చు.
సాధారణంగా పుదీనా ఆకులను రోజుకు రెండుసార్లు తింటే సరిపోతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండి, గ్యాస్, కడుపు నొప్పితో బాధపడేవారికి పుదీనా ఆకులు సంజీవనిగా పనిచేస్తాయి. ఈ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పుదీనా ఆకులు అమ్మాయిల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలకు, కడుపు నొప్పి, మంట, వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి. నోటి నుండి ఎప్పుడూ దుర్వాసన వస్తుంటే, పుదీనా ఆకులు ఈ సమస్యకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఈ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల నోటిలోని క్రిములు నశిస్తాయి. నోటినుంచి వచ్చే దుర్వాసనను పోగొడుతుంది.
ఇంకా ఏమేమి ఉపయోగాలున్నాయంటే..
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
- పుదీనా కడుపు నొప్పి... అజీర్ణం...గ్యాస్ ... ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- పుదీనాలో ఉండే మెంథాల్ నోటి దుర్వాసనను తగ్గిస్తుంది
- పుదీనా నూనె ను తలకు.. శరీరానికి రాసుకుంటే ఒత్తిడి .. ఆందోళన తగ్గుతాయి.
- పుదీనా నూనె తలనొప్పి.... కండరాల నొప్పి .. ఇతర రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- దగ్గు... జలుబు... ఉబ్బసం.. ఇతర శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.
- మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
- జ్ఞాపకశక్తి ... మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
- పుదీనా ఆకులలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి చుండ్రును నివారిస్తాయి.
- పుదీనా దంతాలు .. చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- టీలో.. సలాడ్‌లలో... చట్నీలలో ... ఇతర వంటకాలలో ఉపయోగిస్తే రుచికరంగా ఉంటాయి..
పుదీనా మార్కెట్లలో దొరుకుతుంది. అలాగే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఉదయంరెండు లేదా మూడు తాజా పుదీనా ఆకులను నమిలితే ఆరోగ్య సమస్యలు మీకు దూరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.