75 ఏళ్లకు రిటైర్ అవ్వాలి.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి : RSS చీఫ్ భగవత్

75 ఏళ్లకు రిటైర్ అవ్వాలి.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి : RSS చీఫ్ భగవత్

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం నాయకులు 75 ఏళ్ల వయసులో పక్కకు తప్పుకోవాలని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ మాటలు మొదట ప్రధాని మోడీకి వర్తిస్తుందని తెలిపింది. ప్రధాని మోదీ, భగవత్ ఇద్దరికి సెప్టెంబర్‌లో 75 ఏళ్లు నిండుతాయి, అంతేకాదు  వీరిద్దరి పుట్టినరోజులకు కేవలం ఆరు రోజులు మాత్రమే తేడా. 

విదేశీ పర్యటన నుండి తిరిగోచ్చిన కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, ప్రధాని మోడీపై తీవ్రంగా విమర్శలు చేశారు. మోడీ చేపట్టిన విదేశీ పర్యటనల్లో ఇదే అత్యంత ఎక్కువకాలం నాటిది. పాపం ప్రధానమంత్రి, ఎంత గొప్పగా దేశానికి తిరిగి వచ్చారో. సెప్టెంబర్ 17 ఆయనకు 75 ఏళ్లు నిండుతాయని తిరిగి రాగానే ఆర్‌ఎస్‌ఎస్ అధినేత గుర్తు చేశారు అంటూ ట్వీట్ చేశారు. అయితే, రమేష్ మరో ట్వీట్‌లో ప్రధాని మోడీ కూడా సెప్టెంబర్ 11న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు 75 ఏళ్లు నిండుతాయని గుర్తు చేయవచ్చని రాసుకొచ్చారు. 

 మోహన్ భగవత్ మాటల తర్వాత రమేష్ సహచరుడు పవన్ ఖేరా కూడా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఇప్పుడు మీరిద్దరూ బ్యాగ్ సర్దుకొని ఒకరినొకరు గైడ్ చేసుకోండి అంటూ ట్వీట్ చేసారు. నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లేకు సంబంధించిన ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ  ఎవరైనా 75 ఏళ్ల శాలువా కప్పుకుంటే అంటే వారికి ఆ వయసు వచ్చిందని, అలాగే వారు పక్కకు తప్పుకుని ఇతరులకు పని చేసే అవకాశం ఇవ్వాలని గుర్తు చేశారు.

 

గత మార్చిలో ప్రధాని మోదీ నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు, చాలా సంవత్సరాల తర్వాత ఇదే ఆయన మొదటిసారి సందర్శన. ఆ సమయంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ప్రధానమంత్రి అతని పదవీ విరమణ ప్రకటించడానికి వచ్చారని పేర్కొన్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన సుమారు 10 నుండి 11 సంవత్సరాలలో ఎప్పుడూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించలేదు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంలో మార్పును కోరుకుంటోంది అని అన్నారు. అయితే, బిజెపి ఈ మాటలను కొట్టిపారేససింది అలాగే  ఇదొక  సాధారణ సందర్శన అని తెలిపింది.