ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలి : కలెక్టర్ హనుమంతరావు

ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలి : కలెక్టర్ హనుమంతరావు

యాదగిరిగుట్ట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఏర్పడకుండా చూడాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తుర్కపల్లి మండలం కోనాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తాపీ మేస్త్రీలు, లబ్ధిదారుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోకుండా కమిటీ నిర్ణయించిన రేట్లకు ఇండ్లు కట్టాలని సూచించారు. విలేజ్ సెక్రటరీ, ఏఈలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఫొటోలు తీసి యాప్ లో అప్​లోడ్ చేయాలని ఆదేశించారు. 

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఆమె వెంట కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్, అధికారులు తదితరులు ఉన్నారు.