
అందరు ఎంతో ఇష్టంగా తినే ఇరానీ చాయ్, బన్ మస్కా ఒక్కసారి భయాన్ని పుట్టించింది. మాములుగా చాల మంది ఇరానీ చాయ్'తో పాటు బన్ మస్కా తింటుంటారు. అయితే ఈ బన్ మస్కా ప్రతిఒక్కరి ఆల్ టైం ఫెవరెట్ ఫుడ్. అలంటి బన్ మస్కాలో మీరు ఊహించనిది కనిపిస్తే...
పూణేలోని ఫెర్గూసన్ కాలేజ్ రోడ్‌లో ఫెమస్ అయిన గుడ్‌లక్ కేఫ్‌లో ఒక కస్టమార్కి బన్ మస్కా తింటుండగా గాజు ముక్క రావడంతో ఆహార భద్రత విషయంలో ఆందోళన కలిగించే సంఘటన వెలుగులోకి వచ్చింది. దింతో ఆహార ప్రియుల్లో అలాగే కస్టమర్లలో భయాలు రేకెత్తించింది.
తన భార్యతో కలిసి గుడ్‌లక్ కేఫ్‌కి వెళ్లిన ఆకాష్ జల్గి ఈ బాధాకరమైన అనుభవాన్ని షేర్ చేసాడు. "బన్ మస్కా తింటుండగా అకస్మాత్తుగా నోటిలో ఏదో గట్టి పదునైనది తగిలినట్టు అనిపించింది. మొదట, అది మంచు ముక్క(ICE) కావచ్చు అనుకున్నాను, కానీ తీరా చూస్తే అది పగిలిన గాజు ముక్క అని తెలిసింది. ఇలాంటి చిన్న పొరపాటు వల్ల ప్రాణాపాయం లేదా మింగివేస్తే ప్రమాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది." అని ఆకాష్ జల్గి అన్నారు.
ఆకాష్ జల్గి వెంటనే ఈ విషయాన్ని కేఫ్ యాజమాన్యంకి చెప్పగా, సిబ్బంది క్షమాపణలు చెప్పి బిల్లు మాఫీ చేసినట్లు చెప్పారు, కానీ ఇది చిన్న విషయం కాదని ఆకాష్ జల్గి అన్నారు. ఎందుకంటే ఇది కేవలం డబ్బు గురించి కాదు. ఒకవేళ ఎవరైనా చిన్న పిల్లవాడు దీన్ని తిని ఉంటే ? పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఆన్‌లైన్ ఫిర్యాదుల పోర్టల్ ద్వారా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు కంప్లైంట్ చేసినట్లు తెలిపారు.
మొదట్లో కేఫ్ యాజమాన్యం ఈ సమస్యను అంగీకరించి, బన్ మస్కా బయట నుండి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. అలాగే మేము ఇప్పటికే ఈ సమస్యను బన్ మస్కా సప్లయర్లకి చెప్పాము. మా వల్ల కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము అని గుడ్‌లక్ కేఫ్ యాజమాన్యం చెప్పినట్లు తెలిపారు. అయితే, దీనిపై కేఫ్ యాజమాన్యం స్పందన చాలా మంది కస్టమర్లకు నచ్చలేదు.
ఈ ఘటనకి సంబంధించి ఫిర్యాదు అందిందని FDA తెలపగా, దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పింది. ఈ సంఘటన అప్పటి నుండి సోషల్ మీడియాలో తీవ్ర దుమారం లేపింది, ముఖ్యంగా పూణేవాసుల్లో. గుడ్‌లక్ కేఫ్ కేవలం తినడానికి ఒక ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఒక గతాన్ని గుర్తుచేసే ల్యాండ్‌మార్క్.