
కేయూ క్యాంపస్, వెలుగు: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కె. పార్థివ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో చంద్రయాన్ -2 లాండింగ్ను లైవ్లోచూసేందుకు ఇస్రో నుంచి ఆహ్వానం లభించింది. రాష్ట్రం నుంచి ఇద్దరు స్టూడెంట్లకు ఆహ్వానం అందగా హన్మకొండ పోచమ్మకుంట తేజస్వి స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్న కె. పార్థివ్ అందులో ఒకరు. తమ స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్కు ఇస్రో నుంచి ఆహ్వానం దక్కడం చాలా సంతోషంగా ఉందని తేజస్వి విద్యాసంస్థల చైర్మన్ ఆర్. జెన్నారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్థివ్ ను , అతని తల్లిదండ్రులను పాఠశాల హెడ్మాస్టర్జి. సంధ్యారాణి అభినందించారు.