హనుమత్​ జయంతి 2024: ఆంజనేయస్వామికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా...

హనుమత్​ జయంతి 2024:  ఆంజనేయస్వామికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా...


 

హనుమాన్ ఆలయాల్లోని ఆంజనేయస్వామి  సింధూరం రంగులోనే భక్తులకు దర్శనం ఇస్తారు.   ఆంజనేయుడి ఆలయంలో భక్తులు నుదుట ధరించే కుంకుమ కూడా  సింధూరమే  మరి.. మారుతికీ ఈ రంగుకు ఉన్న సంబంఏమిటి..   హనుమంతునికి సింధూరాన్ని పూయడం వెనుక ఆంతర్య ఏమిటి ...  పురాణాలు ఏం చెబుతున్నాయో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. కొలిచిన వారికి.. తలచిన వారికి కొండంత అండగా ఉంటాడని.. అభయమిస్తాడని నమ్ముతారు. అందుకే దేవుళ్లు ఎంత మంది ఉన్నా.. వారిలో హనుమంతుడు వెరీ స్పెషల్. అయితే.. హనుమంతుడు(Hanuman)కి సింధూరం కలర్​కు  ఎంతో అవినావబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి.  జెండాపై ఎగురుతున్న కపిరాజు ( ఆంజనేయస్వామి)  చాలా ఫేమస్.  ఓ చేతిలో గద, మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్.. ఆ కాశంలో రివ్వున ఎగిరిపోతున్నట్టుగా ఉంటుంది ఆ చిత్రం. ఆ జెండా రంగు సింధూరం. అలాగే తన ఆలయంలో ఆంజనేయస్వామి సింధూరం రంగులోనే దర్శనమిస్తాడు. హనుమాన్ కుంకుమ కూడా సింధూరమే.

దేవాలయాలలో హనుమంతుని విగ్రహాలు ఎక్కువగా ఆరెంజ్ సింధూర్​ కలర్​లో ఉండడం వెనకు పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది. రామాయణం ప్రకారం.. ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో సీతాదేవి నుదిటి మీద ఎర్రటి పొడి(సింధూరం) ధరిస్తుంటుంది. అది గమనించిన ఆంజనేయస్వామి.. "అమ్మా.. ఏంటి ఆ పొడి? దాని ఎందుకు పెట్టుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి?" అని అడిగాడని వ్యాసమహర్షి తెలిపాడు. .

హనుమా.. ఇది సింధూరం. ఇది శ్రీరాముడిని సంతోషపరుస్తుంది. సంపన్నమైన, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది." అని వాయుపుత్రుడితో సీతమ్మ చెబుతుంది. అందుకే.. తాను పాపిట సింధూరం ధరిస్తాననని చెబుతుంది. ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత హనుమంతుడు తన శరీరమంతా పూర్తిగా ఎర్రటి సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు. శరీరంతో పాటు దుస్తులు, జుట్టును కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు వాయుపుత్రుడు.

సింధూరంతో శరీరాన్ని  కప్పుకున్న హనుమంతుడు.. అలాగే రాముడి వద్దకు వెళ్తాడు. అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు. అందుకు గల కారణమేంటని ఆంజనేయస్వామిని అడుగుతాడు. అప్పుడు వాయు పుత్రుడు శ్రీరామునితో ఇలా చెబుతాడు. "సీతామాత తన నుదిటిన రోజూ సింధూరాన్ని పూయడం వల్ల మీకు(రాముడు) సంతోషం కలుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని  ఆంజనేయస్వామి చెప్పినట్లు పురాణాల్లో రుషి పుంగవులు చెప్పారు. 

చిటికెడు సింధూరమే మీకు సంతోషాన్నిస్తే.. నేను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే ఇంకా మరింత ఆనందం కలుగుతుంది కదా.. అందుకే రాసుకున్నాను" అని చెబుతాడు.అప్పుడు హనుమంతుని మాటలకు సంతోషించిన రాముడు.. ఆయన భక్తులకు ఒక వరమిచ్చాడట. ఎవరైతే హనుమంతునికి పూర్తి సింధూరాన్ని పూసి పూజిస్తారో.. వారికి సంతోషకరమైన ర్ఘాయువుతోపాటు.. కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడట. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు సింధూరంతో కళకళలాడుతుంటాయని చెబుతున్నారు పండితులు.