హనుమాన్​ జయంతి మే 22 : హనుమాన్​ దీక్ష ను విరమించే ప్రముఖ ఆలయాలు ఇవే..!

హనుమాన్​ జయంతి  మే 22 :  హనుమాన్​ దీక్ష ను విరమించే  ప్రముఖ ఆలయాలు ఇవే..!

నమ్మినవారికి నేనున్నానంటూ వరాలు ఇచ్చే దేవుడు ఆంజనేయుడు. శ్రీరాముడిని నమ్మిన భక్త ఆంజనేయుడు. సింధూర ప్రియుడు. ఒక్కసారి మాలధరించి 'అంజన్నా.. అని పిలిస్తే' పలుకుతాడనే నమ్మకం. అందుకే ఆంజనేయస్వామి దేవాలయాలకు  హనుమాన్ మాలకు అంత ప్రాధాన్యం ఉంది.అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఒకసారైనా హనుమాన్ మాల ధరించాలనుకుంటారు.  మే 22న హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకపూజల అనంతంరం హనుమాన్​ దీక్షను విరమిస్తారు.  తెలుగు రాష్ట్రాల్లోని ... ఆంజనేయుడి ప్రధాన ఆలయాల గురించి తెలుసుకుందాం. . 

తెలుగు రాష్ట్రాల్లో  హనుమత్​ జయంతి రోజున ( మే 22) ఆంజనేయస్వామి దేవాలయాలు కిటకిటలాడిపోతాయి.  జై హనుమాన్... జై శ్రీరాం అంటూ ప్రముఖ ఆంజనేయుని ఆలయాలు  ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి.   అంజన్న భక్తులు 41 రోజుల పాటు కఠిన దీక్షను పాటించి..హనుమత్​ జ్జయంతి  రోజున ( మే 22) సుందరాకాండ పారాయణం.. హనుమాన్​ చాలీసా పారాయణం  చేసి.. హనుమన్న భక్తులు దీక్ష విరమణ చేస్తారు.  

ALSO READ | మే 22న జాపాలిలో హనుమాన్ జయంతి వేడుకలు..

 తెలుగు రాష్ట్రాల్లో కుశలేంద్ర స్వామి, కొండాపూర్, యాదాద్రి , కర్మన్​ ఘాట్​ ఆంజనేయస్వామి దేవాలయం.. తాడ్​బండ్​.. కొండగట్టు ..భద్రాచలం...దేవాలయాలు....  ఆంధ్రప్రదేశ్​ లోని విజయవాడ , గుంటూరు జిల్లా పొన్నూరు దేవాలయం.. ఎన్టీఆర్​ జిల్లాలోని మేడూరు ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తులు ఆంజనేస్వామికి  ప్రత్యేక పూజలు చేసి దీక్షను విరమిస్తారు. కొంతమంది భక్తులు పాదయాత్ర ద్వారా స్వామి సన్నిధికి చేరుకుంటారు.కఠిన నియమాలు ఆచరించిన భక్తులు  ఆంజనేయుడి సేవలో తరిస్తున్నారు.   మాలధారణ చక్కని నడవడిక, ఆరోగ్యం, ఆధ్యాత్మికత అందిస్తుంది. అందుకే హనుమాన్ మాలకు అంత ప్రాధాన్యం ఉందని పండితులు అంటున్నారు.