కొండగట్టులో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం

కొండగట్టులో  హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం

కొండగట్టులో రేపు జరిగే హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా కొండగట్టుపై సౌకర్యాలను పరిశీలించారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ప్రశాంతంగా మొక్కులు చెల్లించుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.